మత్తు పదార్థాలతో కుటుంబాలపై తీవ్ర ప్రభావం | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలతో కుటుంబాలపై తీవ్ర ప్రభావం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

భైరాపూర్‌ సొసైటీకి తాళం వేసిన రైతులు

నిజామాబాద్‌అర్బన్‌: మత్తు పదార్థాల వినియోగంతో కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని డీ అడిక్షన్‌ మెడిసిన్‌ స్పెషాలిటీ సెక్షన్‌ చైర్మన్‌ డాక్టర్‌ విశాల్‌ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం ఇండియాన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని దేశంలో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం, ప్రవర్తన, వ్యసనాల సమస్యపై ప్రసంగించారు. ఆల్కాహాల్‌తో ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు, పొగాకు వాడటంతో 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన డాక్టర్‌ అంకం గణేశ్‌

నిజామాబాద్‌ రూరల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ నగరంలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించిన ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్థోసర్జన్‌ (ఐఏవోఎస్‌) ఐదో జాతీయ సదస్సులో జిల్లాకు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ అంకం గణేశ్‌ ప్రసంగించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 350కి పైగా ప్రముఖ వైద్యుల సమక్షంలో తన క్లినికల్‌ అనుభవం, ఆధునిక వైద్య విధానాలను ప్రదర్శించారు. అత్యంత క్లిష్టమైన కీలక కేసులను ప్రెజెంట్‌ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని పేర్కొన్నారు.

ఇందూర్‌ లలితకు

ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు

బోధన్‌: బోధన్‌ పట్టణంలోని తట్టికోట ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు ఇందూర్‌ లలిత రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ ప్రేరణ అవార్డు –2026ను అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన శారద ఎడ్యుకేషనల్‌ సొసైటీ విద్యతోపాటు వివిధ రంగాల్లో ప్రతిభచాటుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన రాష్ట్రస్థాయిలో 50 మందికి పైగా ఉపాధ్యాయులు, మహిళలను అవార్డుకు ఎంపిక చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఇటికాల పురుషోత్తం చేతుల మీదుగా లలిత అవార్డు అందుకున్నారు.

బాన్సువాడ : బీర్కూర్‌ మండలం భైరాపూర్‌ సహకార సంఘం కార్యాలయానికి ఆదివారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. సొసైటీ పరిధిలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు చేయడం లేదని, ఇతర గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. వారం రోజులుగా సొసైటీ కార్యదర్శి విధులకు హాజరుకావడం లేదని, ఫోన్‌ చేసినా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ధాన్యం కుప్పలు ఉన్నాయని, వాతావరణంలో మార్పులు వస్తుండడంతో ఆందోళనగా ఉందని పేర్కొంటున్నారు. వెంటనే కాంటాలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement