ఖలీల్‌వాడి: మోడల్ స్కూళ్లలో ప్రవేశం కోసం ఆదివారం జిల్లా కేంద్రంలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు డీఈవో పార్శి అశోక్ తెలిపారు. ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఆరో తరగతి విద్యార్థులు 1,365 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. ఏడు నుంచి పదో తరగతి విద్యార్థులు 977 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 837 మంది హాజరయ్యారు. ఆర్మూర్, బాల్కొండ మోడల్ స్కూళ్లలోని పరీక్ష కేంద్రాలను డీఈవో పరిశీలించారు.
మాచారెడ్డి : వడదెబ్బతో ఓ రైతు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన ఆదివారం పా ల్వంచ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. పాల్వంచ గ్రామాని కి చెందిన చాకలి మల్లయ్య(46) ఇటీవల వరి కోసి ధాన్యాన్ని కల్లంలో ఆరబోశాడు. మూడు నాలుగు రోజులుగా ఎండలో ధాన్యాన్ని ఆరబెడుతూ వడ దెబ్బకు గురయ్యాడు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై వడ్లపైనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శంకరమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వడదెబ్బతో మరణించిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు.
ముందే వికసించిన
‘మే’ పుష్పం
ఖలీల్‌వాడి: ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే ‘మే’ పుష్పం ముందే వికసించింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ హెడ్‌మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ ఇంట్లో ఉన్న మొక్కకు రెండు పూలు పూశాయి. వాతావరణంలోని మార్పులతో నెల ముందుగానే మే పుష్పాలు వికసిస్తుంటాయి. ఈ అరుదైన పుష్పాల ను కాలనీవాసులు ఆసక్తిగా తిలకించారు.


