బోనమెత్తిన పోచారం | - | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన పోచారం

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

బోనమెత్తిన పోచారం వ్యవసాయ పనులకు భూమిపూజ నూతన కార్యవర్గం ఎన్నిక

వర్ని: మోస్రా మండల కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని, మహిళలతో కలిసి బోనం ఎత్తారు. గ్రామ ప్రధాన వీధుల గుండా బోనాలతో శోభాయా త్ర నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించారు. గ్రామ దేవతల ఆశీస్సుల వల్ల పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతున్నారని పోచారం వెల్లడించారు. సంఘ అధ్యక్షుడు బిల్ల రాజశేఖర్‌ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, వర్ని ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌, వీడీసీ అధ్యక్షుడు పోతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ సాయిగౌడ్‌, నాయకులు గుత్ప విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

రెంజల్‌(బోధన్‌): మండలంలోని బోర్గాం గ్రా మంలో ఆదివారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వ్యవసాయ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని స్వాధ్యాయ పరివారులు గ్రామం నుంచి ట్రాక్టర్లు, జోడెడ్లతో అరక, నాగలి వెంట తీసు కుని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు.

నేడు తెయూ పాలకమండలి పరిచయ కార్యక్రమం

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యులుగా ప్రభుత్వం ద్వారా నామినేట్‌ అయిన నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని(గెట్‌టుగెదర్‌) సోమవా రం నిర్వహించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి నూతన ఈసీ మెంబర్లను వర్సిటీకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు తెయూ పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటివ్‌ హాల్‌లో సోమవారం ఉదయం 11.30 గంటలకు నూతన ఈసీ మెంబర్లు ఒకచోట కలువనున్నారు. అనంతరం ఈసీ మెంబర్లను సన్మానించనున్నారు. ఈసీ మెంబర్లు సీహెచ్‌ ఆంజనేయులు, ఆర్‌.సుధాకర్‌గౌడ్‌, కే.సంజీవరావు, దండు స్వామి, మదన్‌ మోహన్‌ దేవబక్తుని, చెరుకూరి రజినీకాంత్‌ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్‌ ఘాజీ, ఎస్‌.జయంత్‌ తెయూకు రానున్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా వంజరి సంఘ కా ర్యవర్గ సమావేశం మామిడిపల్లి వంజరిసంఘ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాస్టర్‌ శంకర్‌, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్‌, కోశాధికారిగా కరిపే మధుసూదన్‌ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ.. త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని తెలిపారు. కార్యదర్శి గంగోనే మల్లేష్‌, కోశాధికారి నవతే నర్సయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement