హిందుత్వమే దేశానికి శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

హిందుత్వమే దేశానికి శ్రీరామరక్ష

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

నిజామాబాద్‌ రూరల్‌: హిందుత్వమే దేశానికి శ్రీరామరక్ష అని ఇందూర్‌ విభాగ్‌ సహ సంఘ్‌ చాలక్‌ పాలేటి వెంకట్రావ్‌ అన్నారు. నగరంలోని లక్ష్మీప్రియనగర్‌లో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వెంకట్రావు ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు. ఇంట్లోని పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలతోపాటు క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం వంటి లక్షణాలు నేర్పించాలని కోరారు. అలాగే ఆర్యనగర్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత గ్రామ వికాస్‌ సహ సంఘటక్‌ వేంపల్లి ప్రతాప్‌ హాజరై, మాట్లాడారు. విశ్వ కల్యాణం హిందూ ధర్మంతోనే సాధ్యమన్నారు. గాయత్రినగర్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వరంగంటి శ్రీనివాస్‌ ప్రధాన వక్తగా హాజరై, మాట్లాడారు. మానవాళి హితమే మన హితం అని భావించిన దే శం భారత్‌ అని అన్నారు. అనంతరం హంపి విద్యారణ్య విరూపక్ష జగద్గురు శంకరాచార్యులు ఆశీర్వాద ప్రసంగం చేస్తూ.. ప్రతి మహిళ సంస్కృతిని, సభ్యతను భావితరాలకు అందచేయాలన్నారు. ప్ర తినిధులు భార్గవ్‌, రామకృష్ణ, వెంకట కృష్ణ, దాసరి గంగాధర్‌, శ్రీనివాస్‌, భూమేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement