అంబేడ్కర్‌ ఆశయాలను సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ ఆశయాలను సాధిద్దాం

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

తెయూ(డిచ్‌పల్లి):ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయాలను సాధిద్దామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ జా తీయ కార్యవర్గ సభ్యుడు జీవన్‌ అన్నారు. ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల అంబేడ్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా క్రీడోత్సవ్‌–2026 నిర్వహించగా,ఆదివారం వర్సిటీ కా మర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో బ హుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో పేద, ధనిక,చిన్నకులం, పెద్ద కులం అని తేడాలు ఉండవద్దని, అందరం భర తమాత బిడ్డలమని, అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో అంబేడ్కర్‌ గొప్ప రాజ్యాంగం రచించారన్నారు. గౌరవ అతిథిగా హాజరైన దంతవైద్యుడు, యశ్వి డెంటల్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ ప్రతాప్‌ నాయక్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమేనని తెలిపారు. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఏబీవీపీ ప్రతినిధులు శివ, పృథ్వీ, సమీర్‌, అనూష, హర్షవర్ధన్‌, అమృత్‌చారి, అశోక్‌, అక్షయ్‌, మోహన్‌, మనోజ్‌, అనిల్‌, లెనిన్‌, విఘ్నేష్‌, మహేష్‌, అఖిల్‌, దుర్గాదాస్‌, సూర్య, కార్తీక్‌, విగ్నేష్‌, కిరీటి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement