రక్తదాతలకు హెల్మెట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలకు హెల్మెట్ల పంపిణీ

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

వాహనాల తనిఖీ

కామారెడ్డి టౌన్‌: డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 135వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రక్త దాతలకు ఆదివారం కామారెడ్డి టౌన్‌ సీఐ నరహరి చేతుల మీదుగా హెల్మెట్లు పంపిణీ చేశారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేసిన 50 దాతలకు రోడ్డు సేఫ్టీలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్‌, జిల్లా అధ్యక్షు డు ప్రవీణ్‌ నాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, ఐవీఎఫ్‌ చైర్మన్‌ బాలు, ఆర్కే కళాశాల చైర్మన్‌ జైపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. లైసెన్స్‌లు, పొల్యూషన్‌, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేనివారితో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించారు. అలాగే పెండింగ్‌ చలానాలు ఆన్‌లైన్‌లో కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఎస్సై నరేష్‌, పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement