నిజామాబాద్‌అర్బన్: ప్రతిఒక్కరూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి పరమేశ్వర్ అన్నారు. నగరంలో ఆదివారం ఆగ్నిమాపకశాఖ వారోత్సవాల సందర్బంగా వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలపై ముందస్తు జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి చరిత్ర తెలిపే ప్రాచీన కోడూరి ఆంజనేయస్వామి ఆలయం జీర్ణోద్ధరణ అనంతరం ఆదివారం భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతమైందని వేదపండితులు ఆంజనేయశర్మ అన్నారు. ఆలయ కమిటీ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, భక్తులు దాదాపు వెయ్యి మంది ముందుకు వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హన్‌మాన్ చాలీసా సామూహిక పారాయణం 101 సార్లు చేయగా అదే సమయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శబరిమాత దివ్యసమాధి, ప్రతిమ, చిత్రపటాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. తాడ్వాయి నుంచే కాకుండా ఇతర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


