ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

నిజామాబాద్‌ రూరల్‌: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే వ్యాధులు రావని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు గంగారాం, ఇన్నమూరి రవితేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్‌లోగల స్నేహా సొసైటీ ఫర్‌ రూరల్‌ రీ కన్స్‌ట్రక్షన్‌ దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హిమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా కూడా ఒకటని అన్నారు. ఏ వ్యాధికై నా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చన్నారు.. . దాసరి విజయ్‌ నందరావు, అంబరీష్‌, యజాస్‌, రఘు, సంతోష్‌, జగదీ ష్‌, సొసైటీ కార్యదర్శి సిద్దయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement