బాన్సువాడ: ఈనెల 13న బాన్సువాడ పోస్టాఫీసులో వాచ్‌మన్‌పై దాడి చేసి చోరీకి పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపనున్నట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్‌పేట్‌కు చెందిన కుర్మ శివకుమార్, కుర్మలావణ్య భార్యాభర్తలిద్దరు బాన్సువాడ పోస్టాఫీసులో చోరీ చేసేందుకు వచ్చారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్ సాయిలుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సాయిలు వద్ద ఉన్న రూ.1000 నగదుతోపాటు పోస్టాఫిసులో ఉన్న మూడు సెల్‌ఫోన్లను దొంగిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితులను గుర్తించారు. శివకుమార్, లావణ్య బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామె పోస్టాఫీసులో దొంగతనం చేసినట్లు అంగీకరించారన్నారు. అనంతరం నిందితుల నుంచి రూ.1000 నగదు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ హైదరాబాద్‌తోపాటు పలు పాంత్రాల్లో సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడ్డారని, వారిపై పలు కేసులున్నాయన్నారు. కేసును చేధించిన సీఐ శ్రీధర్, ఎస్సై, పోలీసు సిబ్బందిని అభినందించారు.


