తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, పీఆర్‌సీని ప్రకటించాలని తెయూ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బట్టు సురేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో పీఆర్‌సీ ఇస్తామని హామీ ఇచ్చి నెలలు గడిచినా, ఇప్పటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి బికోజీ, సభ్యులు నవ్య, వకుల, రవి నాయక్, తిరుపతి,హరీష్,సురేష్‌రెడ్డి, సతీష్,గులాబ్,ఆసిఫ్, అఖి ల్, దిలీప్, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.


