బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలోగల సాయి ఆగోర ఇండస్ట్రీస్ రైస్‌మిల్‌లో 144.2 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీసీఎస్ పోలీసులతోపాటు స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ రైస్‌మిల్‌లో నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, స్థానిక పోలీసుల కలిసి రైస్‌మిల్‌పై దాడులు నిర్వహించారు. దీంతో రెండు ఆటోలతోపాటు లారీలో లోడ్ చేసిన రేషన్ బియ్యంను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయ్ డిప్యుటీ తహసీల్దార్ హనుమాన్ పంచనామ నిర్వహించగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.


