తొందర్లోనే ఛేదిస్తాం
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చి వెనుక ప్రాంతంలో ఫిబ్రవరి 2న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా కోసి, సంచుల్లో మూటగట్టి ఆ మూటలను అక్కడక్కడా పడేసిన ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఈమిస్టరీ మర్డరీ కేసు చేధన పోలీసులకు సవాల్‌గా మారింది.
కలకలం రేపిన ఉదంతం ..
ఈ కేసులో మొదట ఓ సంచిలో నడుము నుంచి కిందివైపు భాగం శరీర భాగాలు లభించాయి. రెండు రోజుల తర్వాత కొద్ది దూరంలోని ఓ చిన్న కాలువలో తల, చేతులు ఉన్న మూటను గుర్తించా రు. మిగితా శరీర భాగం లభ్యం కాలేదు. దానిని మరో సంచిలో వేసి పట్టణంలో కాకుండా మరెక్కడైనా దూర ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పో లీసులు భావించారు. శివారు ప్రాంతాలన్నీ గాలించినా మిగితా భాగాలు లభ్యం కాలేదు. ఓ వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేయడం పట్టణంలో కలకలం రేపింది. లభించిన శరీర భాగాలన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతుడిని గుర్తించడం సాధ్యం కాలేదు. పోలీసులు కేసును సవాల్‌గా తీ సుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులు, సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ణానం ఆధారంగా విచారణ జరిపా రు. చివరకు పక్క రాష్ట్రాల పోలీసులకు సైతం మృతుని ఆనవాళ్లతో కూడిన సమాచారం చేరవేశారు. మృతుడిని గుర్తించినా, కేసుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఇచ్చినా రూ.10 వేలు రివార్డు సైతం ప్రకటించారు. అయినా హత్యకు ౖగురయిన వ్యక్తి ఎవరనేది గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో కేసులో ముందడుగు పడలేదు. హతుడు, హంతకులు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ హత్య తరువాత జరిగిన పలు హత్య కేసులను పోలీసులు తక్కువ వ్యవధిలోనే ఛేదించారు. కానీ ఈ కేసు మాత్రం పెండింగ్ లోనే ఉంది. చివరికి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి.
శరీర భాగాలు లభించిన కేసు లో అన్ని కోణాల్లోనూ విచారణ జరిపాం. శరీర భాగాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో చనిపోయి న వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఇతర అన్ని కోణాల్లో ప్ర త్యేక బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి. విచార ణ కొనసాగుతోంది. తొందర్లోనే కేసును చేధిస్తాం.
– నరహరి,
ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 2న
సంచిలో వెలుగుచూసిన మృతదేహం
మృతుడు.. హంతకుడు..
ఎవరో తెలియని పరిస్థితి
వివరాల కోసం శోధిస్తున్న
ప్రత్యేక బృందాలు
రూ.10 వేలు రివార్డు
ప్రకటించిన పోలీసులు
సవాల్‌గా మారిన కేసు


