ప్రభుత్వం స్పందించాలి..
● 2023లో స్పైస్‌పార్క్‌లో ఫుడ్
ప్రాసెసింగ్ యూనిట్ కోసం శంకుస్థాపన
● ప్రభుత్వం మారడంతో
అటకెక్కిన ఏర్పాట్లు
మోర్తాడ్: మహిళా సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలకు నాణ్యమైన సరుకులను అందించడానికి నిర్ధేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2023 సెప్టెంబర్‌లో అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి వేల్పూర్ శివారులోని స్పైస్‌పార్క్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. నిర్మాణ అంచనా వ్యయం రూ.39.37లక్షలుగా నిర్ణయించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.
మహిళా సంఘాలకు ఉపాధి కోసం..
పసుపు, కారం పొడిల ఉత్పత్తి, మసాలాల తయారీతో మహిళా సంఘాల సభ్యులకు చేతినిండా పని కల్పించవచ్చని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళికను రూపొందించారు. జిల్లా లో పసుపు పంట సాగు చేస్తుండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో పసుపు ఉత్పత్తులకు శ్రీకారం చుడితే రైతులకు మంచి ధర లభిస్తుంది. పసుపు ఉత్పత్తుల ఎగుమతులతో అనేక మందికి నాణ్యమై న పొడి లభించడానికి అవకాశం ఉంది. అలాగే కారం, మసాలాలను కూడా స్థానికంగానే తయారు చేస్తే మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతమైతారని అందరూ ఆశించారు. బీడీ పరిశ్రమ అంతంత మాత్రంగానే ఉండటంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కొంతమందికై నా ప్రత్యామ్నా య ఉపాధి లభిస్తుందనే నమ్మకం కలిగింది. కానీ అప్పటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో శిలాఫలకంతోనే సరిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
నిధులు వెనక్కి వెళ్లాయా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం శంకుస్థాపన చేయగా అప్పట్లో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయి ఉంటాయనే సందేహం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం అనుకుంటే మరోసారి నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో సీఎం రేవంత్‌రెడ్డి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తే వేల్పూర్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ జీవం పోసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమైతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మహిళలు వ్యాపారంలో రాణించడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేయూతను ఇస్తుంది. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం పునరాలోచన చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించాలి.
–సురేఖ, మహిళా సంఘం ప్రతినిధి, వేల్పూర్


