సుభాష్‌నగర్:పార్లమెంట్‌లో మహిళా బిల్లును అడ్డుకోవడం దారుణమని, అడ్డుకున్న కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో మహిళలే తగిన గుణపాఠం చెప్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయ ణ అన్నారు. నగరంలోని నిఖిల్‌సాయి చౌరస్తాలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయ త్నం చేశారు. ఈక్రమంలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా బిల్లు కు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ నిజ స్వరూ పం బయటపడిందన్నారు. 2023లో ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలికినట్టే పలికి ఇప్పుడు వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. డీఎంకే, సమాజ్ వాదీ పార్టీలు కూడా మహిళల పట్ల వారికున్న నైతికతను బయటపెట్టాయని ఆరోపించారు. మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్‌లో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టని మహిళాబిల్లును బీజేపీ ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బొబ్బిలి సువర్ణ వేణు, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, జ్యోతి మురళీ, మహిళా నాయకురాలు వనిత, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
జిల్లాకేంద్రంలో
కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం


