నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Apr 19 2026 7:23 AM | Updated on Apr 19 2026 7:23 AM

నూతన కార్యవర్గం ఎన్నిక తండాల్లో ప్లాస్టిక్‌ నిషేధం సమయపాలన పాటించాలి

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలో శనివారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళా సంఘం నూతన కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రలు అందజేశారు. జిల్లా అధ్యక్షురాలిగా మడుపు స్వప్న, ప్రధాన కార్యదర్శిగా పాదం మాధవి, కోశాధికారిగా లత, ఉపాధ్యక్షురాలు సంబోజి కృష్ణవేణి, లీగల్‌ అడ్వైజర్‌గా ఝాన్సీ రాణి, ప్రధాన కార్యదర్శిగా స్వర్ణలత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రుద్రజడ స్వప్న ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ముఖ్య సలహాదారు, సలహాదారులను, టౌన్‌ ప్రెసిడెంట్‌, ప్రధాన కార్యదర్శిలను సైతం ఎన్నుకొని, నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుద్దాల శ్రీనివాస్‌, కోశాధికారి నూనె వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధర్పల్లి: మండలంలోని నడిమి తండా గ్రామపంచాయతీ పరిధిలోని పలు తండాల్లో ప్లాస్టిక్‌ పేపర్లు, ప్లాస్టిక్‌ కవర్లు వాడడం నిషేధిస్తూ గ్రామపంచాయతీ శనివారం తీర్మానం చేసింది. అనంతరం ప్లాస్టిక్‌ వాడడం వల్ల వచ్చే అనర్థాలను సర్పంచ్‌ తండావాసులకు వివరించారు. ఈసందర్భంగా తండావాసులు స్టీల్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్టీల్‌ బ్యాంకు ద్వారా జగదాంబ గుడికి 200 స్టీలు ప్లేట్స్‌,గ్లాసులను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఉప సర్పంచ్‌ బనావత్‌ సతీష్‌, పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): వైద్య సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్‌వో రాజశ్రీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని, పిల్లలకు నిర్ధేశిత సమయానికి వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. గ్రామాల్లోని ఉప కేంద్రాలను సమయానికి తెరవాలన్నారు. స్థానిక గర్భిణులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెడికల్‌ ఆఫీసర్‌ శుభాకర్‌, సూపర్‌వైజర్‌ సురేంధర్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement