బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి | - | Sakshi
Sakshi News home page

బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

మాక్లూర్‌: బ్రాహ్మణ సంక్షేమానికి అభ్యున్నతికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర నాయకుడు యుగంధర్‌ అన్నారు. మాక్లూర్‌ విశ్వేశ్వరాలయం ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బ్రాహ్మణ అర్చకుల అభినందన సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి యుగంధర్‌ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రాహ్మణ సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల బ్రాహ్మణ అర్చకులపై తెలుగు రాష్ట్రాల్లో భౌతిక దాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ అర్చకులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ అర్చకులను అభినందించే కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో గతేడాది 105 మంది అర్చక స్వాములను సత్కరించినట్లు వివరించారు. నాయకులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, రొట్టె రఘునాథ్‌ శర్మ, కొండపాక చంద్రశేఖర్‌, రాజేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement