క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు లైన్‌మన్‌పై ఫిర్యాదు

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటివల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించగా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం ముగ్గురిని ఆర్మూర్‌ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి వారిలో ఇద్దరికి రూ. 10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ తెలిపారు.

నవీపేట: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో పెంట లక్ష్మి అనే మహిళ మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని జన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం ఎస్సై శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌కో ఏఈతోపాటు లైన్‌మన్‌ రమేష్‌కు కరెంటు సరఫరాలోని సాంకేతిక లోపాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. కానీ వారు ఫిర్యాదులపై స్పందించకపోవడంతో కరెంటు షాక్‌కు గురై లక్ష్మి మృతిచెందిందన్నారు. దీంతో ఆమె మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement