కీర్తనకు వీసీ అభినందన
తెయూ(డిచ్‌పల్లి): పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈనెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం తరపున పాల్గొని ప్రసంగించిన తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం విద్యార్థిని కీర్తనను శుక్రవారం వీసీ చాంబర్‌లో వీసీ యాదగిరిరావు, రిజిస్టార్ యాదగిరి అభినందించారు. వర్సిటీ తరపున రూ.5వేలు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆంగ్ల విభాగం అధ్యాపకులు సమత, రమణాచారి, జోత్స్న, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ అపర్ణ, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీతో ఎంవోయూ
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లైఫ్ సెన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ), ఏ వింగ్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు శుక్రవారం తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, సంస్థ ప్రతినిధులు ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ ద్వారా ఉత్తీర్ణులైన ఎంఎస్సీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ లైఫ్ సైన్సెస్ సెక్టార్ కంపెనీల కొరకు ఈ సంస్థ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది. అలాగే ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ వారి సీఎస్‌ఆర్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులకు ట్రైనింగ్ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇప్పించి ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రసన్న శీల, ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డీసీ సంస్థ సౌత్ ఇండియా క్లస్టర్ హెడ్ అమరేంద్రబాబు, కో–ఆర్డినేటర్ కుమారస్వామి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
తెయూ పాలకమండలి సభ్యులకు సన్మానం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ)కి నూతనంగా నామినేట్ అయిన సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్‌లను శుక్రవారం తెయూలో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ (అటుట్) ఆధ్వర్యంలో సన్మానించారు. వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి, సభ్యులు ఘంటా చంద్రశేఖర్, అపర్ణ, లావణ్య, ఆరతి, రాంబాబు, రవీందర్ రెడ్డి,సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) ఆధ్వర్యంలోనూ ఆంజనేయులు, సుధాకర్‌గౌడ్‌లను సన్మానించారు. టూటా అధ్యక్షుడు పున్నయ్య, ప్రధాన కార్యదర్శి మోహన్‌బాబు, కోశాధికారి నాగరాజు, ప్రొఫెసర్ కనకయ్య, సభ్యులు సత్యనారాయణ, లక్ష్మణ చక్రవర్తి, శిరీష, వాసం చంద్రశేఖర్, నాగరాజు, సాయిలు, రమణచారి తదితరులు పాల్గొన్నారు.
వీసీని కలిసిన ఈసీ మెంబర్
ఖలీల్‌వాడి: నగరంలోని జీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ దండుస్వామి తెయూ పాలక మండలి సభ్యుడిగా ఎంపిక కావడంతో శుక్రవారం ఆయన వీసీ యాదగిరిరావు, రిజిస్టర్ యాదగిరిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిసిటిఏ సంఘం ఆధ్వర్యంలో స్వామిని సన్మానించారు. ప్రిన్సిపాల్ రామ్‌మోహన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, సంఘం అధ్యక్షుడు లింగన్న, అధ్యాపకులు రామస్వామి, పెద్దన్న, అంబర్ సింగ్, ముత్తెన్న, సతీష్, బాబురావు, జయప్రసాద్, భరత్ రాజ్ ఉన్నారు.


