జీజీ కాలేజీలో 6వ సెమిస్టర్‌ పరీక్షల్లో ఒకరు డిబార్‌ | - | Sakshi
Sakshi News home page

జీజీ కాలేజీలో 6వ సెమిస్టర్‌ పరీక్షల్లో ఒకరు డిబార్‌

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

జీజీ కాలేజీలో 6వ సెమిస్టర్‌ పరీక్షల్లో ఒకరు డిబార్‌ పిచ్చికుక్కల దాడిలో చిన్నారికి గాయాలు

ఖలీల్‌వాడి: నగరంలోని జీజీ కళాశాలలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌ అయ్యారు. కళాశాలలో శుక్రవారం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 769 విద్యార్థులకు గాను 16 మంది గైర్హాజరయ్యారైనట్లు ప్రిన్సిపల్‌ రామోహ్మన్‌రావు తెలిపారు.ఈ పరీక్షల్లో 753 మంది విద్యార్థు లు హాజరు కాగా, ఒకరు డిబార్‌ అయ్యారు. 2వ సె మిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు 1473 విద్యార్థులకు గా ను 22 మంది గైర్హాజరయ్యారైనట్లు చెప్పారు. 1451 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్షలను నియంత్రణాధికారి భరత్‌ రాజ్‌ పర్యవేక్షించారు.

అమర్‌నాథ్‌ యాత్రికులకు

ఇబ్బందులు లేకుండా చూడాలి

సుభాష్‌నగర్‌: అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు మెడికల్‌ పరీక్షల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్‌ విభా గ్‌ కార్యదర్శి తమ్మల కృష్ణ డిమాండ్‌ చేశారు. ఈమేరకు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాములును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. భక్తులకు అన్ని పరీక్షలకు సంబంధించి వైద్యులు, ల్యాబ్‌ ఒకే దగ్గర ఉండేలా చూడాలన్నారు. భక్తుల కు ఇబ్బందులు కలగకుండా సమాచారాన్ని క్లుప్తంగా తెలిసే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని కో రారు.యాత్రికులకు ఎవరికై నా మెడికల్‌ టెస్టుల వి షయంలో ఇబ్బందులు తలెత్తితే 81060–79789, 83096–31515 నంబర్లను సంప్రదించాలన్నారు. వీహెచ్‌పీ ప్రాంత గోరక్ష కృషి ప్రముఖ్‌ ధాత్రిక రమే

ష్‌, కోశాధికారి శేఖర్‌, నగర అధ్యక్షుడు కోడిమేలా శ్రీనివాస్‌, నగర కార్యదర్శి నీకేష్‌, నగర సహా కార్యదర్శి సతీష్‌, సందీప్‌, బజరంగ్‌దళ్‌ నగర సహా సంయోజక్‌ అఖిలేష్‌, తదితరులు పాల్గొన్నారు.

నవీపేట: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌ కాలనీలో శుక్రవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి మహెరపై పిచ్చికుక్కలు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామంలో పిచ్చికుక్కలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, పాలకవర్గం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఎలుగుబంటి దాడిలో ఒకరు..

మోపాల్‌: మండలంలోని మంచిప్ప ఫారెస్ట్‌ శివారు లో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. బాడ్సికి చెందిన గూండ్ల పోశెట్టి గురువారం తూనికాకు సేకరణ కోసం మంచిప్ప ఫారెస్ట్‌ శివారుకు వెళ్లాడు. ఈక్రమంలో అతడిపై ఎ లుగుబంటి దాడి చేయగా, స్వల్ప గాయాలయ్యా యి. వెంటనే అతడు పీఎంపీ వద్ద చికిత్స చేయించు కున్నారు. విషయం తెలుసుకున్న మంచిప్ప ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి సాయి, బీట్‌ ఆఫీసర్లు బాధి తుడిని శుక్రవారం పరామర్శించారు. మెరుగైన చికిత్స కో సం అధికారులు ప్రయత్నించగా, స్వల్పగాయాలయ్యాయని పోశెట్టి తిరస్కరించినట్లు తెలిసింది.

ట్యాంక్‌ ఎక్కి కార్మికుడి నిరసన

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని మున్సిపల్‌ కా ర్మికుడు షేక్‌ హాజీ శుక్రవారం మున్సిపల్‌ మూడవ జోన్‌ కార్యాలయం ఆవరణలోని వాటర్‌ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. తనకు కొన్ని నెలలుగా వేతనాలు రావడం లేదని వెంటనే వేతనాలు ఇప్పించాలని నిరసన చేశారు. ట్యాంక్‌ పైనుంచి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా, కార్మికుడు వారితో వాగ్వాదం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement