బోధన్: బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. ఎడపల్లి పీహెచ్‌సీ అధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెరుగైన వైద్య సేవలను విస్త్రృతంగా కొనసాగించి, ఆరోగ్య రక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సమత, ఎడపల్లి పీహెచ్‌సీ వైద్యుడు వినీత్ కుమార్‌రెడ్డి, వెంకటేశ్, హెచ్‌ఎం రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
హీమోఫీలియా బాధితులకు వైద్యసేవలు ముఖ్యం
సుభాష్‌నగర్: హీమోఫీలియా బాధితులు సమయానికి వైద్యసేవలు పొందడం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ అన్నారు. ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం అవ గాహనా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు హీమోఫీలి యా వ్యాధి గురించి అవగాహన కల్పిస్తూ, ముంద స్తు గుర్తింపు, సరైన నిర్ధారణ, తగిన చికిత్స ద్వారా సమస్యలను నివారించవచ్చని తెలియజేశారు. జీజీ హెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు, వైస్ ప్రిన్సిపాల్స్ తిరుపతి రావు,కిషోర్ కుమార్, హీమో ఫీలియా నోడల్ ఆఫీసర్ పవన్ పాల్గొన్నారు.


