సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రస్తుతం వాణిజ్యపరమైన గ్యాస్ సిలెండర్ల కొరత కారణంగా చాలా హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ఇందుకోసం హోటళ్ల వద్ద ప్రత్యేకంగా టెంట్లు వేసి మరి పెద్దఎత్తున కట్టెలు తెప్పించి నిత్యం వంటకాలు వండుతున్నారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్ వద్ద కట్టెల పొయ్యి కోసం ఇలా ప్రత్యేకంగా టెంట్ వేశారు. గతం కంటే ఎక్కువ ధర చెల్లించి ఎప్పటికప్పుడు పెద్దఎత్తున కట్టెలు తెచ్చుకుంటున్నారు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద పెద్ద ఎత్తున తెప్పించిన కట్టెలను శుక్రవారం ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.


