● రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
● షాద్‌నగర్‌లోని సీఐ నివాసంలో
రూ.12 లక్షలు స్వాధీనం
బిచ్కుంద(జుక్కల్) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎ క్సైజ్ సీఐ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీ బీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్‌లో ఓ కల్లు దుకాణం షిఫ్ట్ విషయంలో సీఐ దుకాణం యజమానిని రూ. 3 లక్షలు డిమాండ్ చేయగా, రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిచ్కుందలో తాను అద్దె ఉంటున్న ఇంటిలో సీఐ రూ.2 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా ఏసీ బీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ గదిలో ఉన్న మరో రూ.45,760 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏకకాలంలో జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు షాద్‌నగర్‌లోని సీఐ ఇంట్లో రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన ఇతర ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందని, నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధికారులు ఎవరైనా ప్రజల నుంచి లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 1064కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
గతంలోనూ సీఐపై
ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు..
ఏసీబీకి పట్టుబడ్డ సీఐ సత్యనారాయణ లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని బిచ్కుంద, మద్నూర్ వైన్స్ యజమానులు గత సంవత్సరం మద్నూర్‌లో పర్యటించిన ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐ వేధింపులపై వైన్స్‌లు బందు చేసి నిరసన తెలిపారు.


