విద్యుదాఘాతంతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమేనని

బంధువుల ఆరోపణ

నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామంలో గురువారం వి ద్యుత్‌ షాక్‌తో పెంట లక్ష్మి (46) అనే మహిళ మృతి చెందిందని ఎస్సై శ్రీకాంత్‌ తెలిపా రు. ఇంట్లోని బోరును స్టార్టర్‌ బాక్స్‌ ద్వారా ఆన్‌ చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. కొడుకు పెంట శివ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సబ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన..

పెంట లక్ష్మి మృతికి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు జన్నెపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా సబ్‌స్టేషన్‌కు తీసుకువచ్చి ఆందోళన చేశారు.

దుబ్బ ప్రాంతంలో కొన్ని నెలలుగా కరెంట్‌ సమస్య ఉందని, షార్ట్‌ సర్క్యూట్‌ ఘటనలు జరుగుతున్నాయని ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌మన్‌ రమేశ్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశా రు. ఎస్సై శ్రీకాంత్‌, సర్పంచ్‌ ముడుసు గంగాధర్‌, ఉప సర్పంచ్‌ వీరేందర్‌రావ్‌ ఘటనా స్థలానికి చేరు కొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement