● కమలాపూర్‌లో రైతుల ధర్నా
డిచ్‌పల్లి: వరి కోతలు పూర్తయి 20 రోజులు గడస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదని నిరసిస్తూ గురువారం మండలంలోని కమలాపూర్‌లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు, స్థానిక కాంగ్రెస్ నాయకుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాన్ని త్వరగా ప్రారంభించాలని డీసీఎంఎస్ మేనేజర్‌కు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. 24 గంటల్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని, లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.


