మాక్లూర్: రెండు గ్రామాలను కలిపి 1800 ఎకరాలకు నీరందించటమే లక్ష్యంగా చేపట్టిన బొంకన్‌పల్లి మినీ లిఫ్ట్ పెండింగ్ పనులను జూన్ చివరి నాటికి పూర్తిచేసి రైతుల పంటలకు నీరు అందిస్తామని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రామకృష్ణ పేర్కొన్నారు. గురువారం బొంకన్‌పల్లి మినీ లిఫ్ట్ పనులను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. లిఫ్ట్ పనులు 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయని జూన్ నాటికి నీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని ధర్మోర చెరువును ఆధారంగా చేసుకుని బొంకన్‌పల్లి, ముల్లంగి(బి) గ్రామాల రైతులకు నీరందించేందుకు గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పట్టుపట్టి నిధులు తెచ్చి మినీ లిఫ్ట్ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎస్‌ఈ వెంట డీఈ రవి కుమార్, ఏఈ యోగేశ్, బొంకన్‌పల్లి సర్పంచ్ మధుకర్‌రావు, ముల్లంగి(బి) సర్పంచ్ ధర్మపతి, ప్రమోద్ రెండు గ్రామాల రైతులు, లస్కర్లు ఉన్నారు.


