వేం నరేందర్‌రెడ్డికి జిల్లా నాయకుల అభినందనలు | - | Sakshi
Sakshi News home page

వేం నరేందర్‌రెడ్డికి జిల్లా నాయకుల అభినందనలు

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

వేం నరేందర్‌రెడ్డికి జిల్లా నాయకుల అభినందనలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు సన్మానం ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాజ్యసభ సభ్యు డిగా గురువారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన వేం నరేందర్‌రెడ్డిని జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, మహమ్మద్‌ అలీ షబ్బీర్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, పొద్దుటూరి వినయ్‌రెడ్డి, బాస వేణుగోపాల్‌యాదవ్‌ తదితరులు వేం నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

సుభాష్‌నగర్‌: నగరంలోని జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇటీవల బా ధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ నాగమోహన్‌రావు ను తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీ స్‌ యూనియన్‌ నాయకులు గురువారం మర్యా దపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా,పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. అనంతరం యూనియన్‌ జిల్లా అధ్యక్షు డు ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డాక్ట ర్‌ నాగమోహన్‌ నాయకత్వంలో ఆస్పత్రి సేవ లు పేద ప్రజలకు ఉపయోగపడేలా మరింత మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో నా యకులు రాజేందర్‌, ప్రవీణ్‌రెడ్డి, రవిగౌడ్‌, సురే శ్‌ రెడ్డి, స్వామి, రమేశ్‌, విద్యా ప్రవీణ, సుధాక ర్‌,రమేశ్‌, మోహన్‌రావు,సిబ్బంది పాల్గొన్నారు.

నిజామాబాద్‌అర్బన్‌: తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షల నేపథ్యంలో సెంటర్ల వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 27 వరకు కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

ఆటోమొబైల్‌ షాప్‌లో

అగ్ని ప్రమాదం

బోధన్‌టౌన్‌(బోధన్‌): పట్టణంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆయిల్‌ ఆ టో మొబైల్‌ దుకాణంలో గురువారం అగ్ని ప్ర మాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న యజమాని ముబీన్‌ దుకాణం వద్దకు రాగా మంటలు చెలరేగుతుండడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంతో సుమారు రూ. 6 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి సుభాష్‌ తెలిపారు.

లేగదూడపై చిరుత దాడి

ఇందల్వాయి: చిరుత దాడిలో లేగదూడ మరణించిన ఘటన ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ రేంజ్‌ అ ధికారి రవి మోహన్‌ భట్‌ తెలిపిన వివరాల ప్ర కారం.. ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మద్ది కుంట నర్సయ్య తన దూడను పొలం వద్ద కట్టి ఉంచాడు. పరిసర ప్రాంత అడవుల్లో సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దూడ కళేబరాన్ని మండల పశువైద్యాధికారి గంగప్రసాద్‌ పరిశీలించి ఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. చిరుత దూడ మెడపై దాడి చేసి రక్తం తాగడంతో మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement