తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు అప్లయిడ్ ఎకనామిక్స్ 10వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ తెలిపారు. మొత్తం 14 మంది విద్యార్థులకు 13 మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
రెంజల్(బోధన్): సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మకై ్క 15వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సాటాపూర్ గ్రామానికి చెందిన యువజన సంఘాల సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌తోపాటు జిల్లా పంచాయతీ అధికారి, బోధన్ డీఎల్‌పీవోలను కలిసి లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్‌లో చట్ట ప్రకారం చెక్కుల ద్వారా నిధులను వినియోగించాల్సి ఉండగా గత నెల 31న సర్పంచ్, కార్యదర్శులు చెక్కులను పాస్ చేసుకొని నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో రఫీక్, అర్జున్, నాగేష్, గంగాధర్ ఉన్నారు.
సుభాష్‌నగర్: నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బోధన్ డివిజన్‌లోని పీహెచ్‌సీ, పల్లె దవాఖానలు, ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, డీఈవోలకు హెచ్‌ఎంఐఎస్‌పై డీఎంహెచ్‌వో రాజశ్రీ గురువారం శిక్షణనిచ్చా రు. గర్భిణుల పేర్ల నమోదు, ప్రసవాలు, వ్యాధి ని రోధక టీకాలు, మాతా శిశు మరణాలు, జీవన శైలి వ్యాధులపై చేస్తున్న నిర్ధారణ పరీక్షలు, తదితర సే వలను హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హె చ్‌ఎంఐఎస్)లో ఏఎన్‌ఎంలు వెంటనే నమోదు చేయాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వడదెబ్బకు గురికాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ వినయ్‌కుమార్, వెంకటేష్, శ్రావ్య, డీహెచ్‌ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, సలీం తదితరులు పాల్గొన్నారు.


