ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ స్కూల్ విద్యార్థులు సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చైర్మన్ డాక్టర్ మారయ్యగౌడ్ గురువారం తెలిపారు. పాఠశాల టీచర్లు, సిబ్బంది శ్రద్ధ, విద్యా ప్రమాణాలపై ఉన్న అంకితభావంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. మొత్తం 500 మార్కులకు విద్యార్థులు రయాన్ మహ్మద్ అన్సార్ 461, ఖవైష్ శర్మ 446, తనయ నలే 444, ఆకారం విహాన్ 444, భవానీ నందిత 441, గజాలే చరణ్ 440, బస్వచేతన్ జుబ్రే 439, చందా హర్షిత్ 437, మెడికొండ సలోమి 436, సుబియా ఇరామ్ 433, జరుపుల కార్తికేయ పవర్ 422 మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.
ప్రతిభచాటిన ప్రెసిడెన్సీ విద్యార్థులు..
జిల్లా కేంద్రంలోని ప్రెసిడెన్సీ హైస్కూల్ విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షల్లో ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచినట్లు చైర్‌పర్సన్ నల్ల శకుంతల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమీహా ఫాతిమా 485, మీర్ యాసిన్ అలీ 481, ఏలేటి మిథిలా 480, శ్రీ వెన్నెల 479, సిరివెన్నెల 478, మిథున్ 478, రామర్తి ఉషశ్రీ 476 మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థుల విజయానికి కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులను యాజమాన్యం, ప్రిన్సిపాల్ పవన్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.


