వర్ని: వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఖదీర్ (47) ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 15న మార్కెట్ కమిటీ కార్యాలయంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో ఖదీర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఆసిఫా బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ ..
ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో సుంకరి జయపాల (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ల గ్రామానికి చెందిన జయపాల భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. కూతురికి వివాహం కాగా జయపాల ఒంటరిగా నివసిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన సోదరుడు బుధవారం ఉదయం నుంచి జయపాలకు ఫోన్ చేస్తున్నా ఎత్తడం లేదు. దీంతో ఇంటికి వెళ్లిన సోదరిడికి అక్క జయపాల శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జయపాల మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని, ఒంటిపై గాయాలు కనిపించటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.


