● ఈ – నామ్ 2.0లో కొనసాగిన
సాంకేతిక సమస్యలు
● రైతుల విజ్ఞప్తి మేరకు ఓపెన్
ఆక్షన్‌లోనే క్రయవిక్రయాలు
సుభాష్‌నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం బహిరంగ వేలం విధానంలోనే పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఈ – నామ్ 2.0లో సాంకేతిక సమస్యల కారణంగా రైతుల విజ్ఞప్తి మేరకు ఓపెన్ ఆక్షన్‌లోనే క్రయవిక్రయాలు కొనసాగించారు. అంతకుముందు చైర్మన్ ముప్ప గంగారెడ్డి వ్యాపారులు, మార్కెట్ కమిటీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ విధానంలోనే క్రయవిక్రయాలకు సులువుగా ఉందని వ్యాపారులు ముక్తకంఠంతో చెప్పారు. సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే ఈ–నామ్ 2.0ను కొనసాగిస్తామని మార్కెట్ అధికారులు సైతం ప్రకటించారు. కానీ గురువారం ఈ – నామ్ 2.0లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రైతుల విజ్ఞప్తి మేరకు మైక్‌లో బహిరంగ ప్రకటన చేశారు. పంట విక్రయాన్ని రైతుల ఇష్టానికే వదిలేశారు. రైతుల విజ్ఞప్తి మేరకు బహిరంగ వేలం విధానంలోనే కొనుగోళ్లు చేపట్టారు.


