ఆంజనేయులు ప్రొఫెసర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆంజనేయులు ప్రొఫెసర్‌

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

తెయూ నూతన పాలకమండలి

తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూని వర్సిటీ నూ తన పాలకమండలి (ఈసీ) సభ్యులను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. పాలకమండలి నామినేటెడ్‌ సభ్యులుగా తెయూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు, సౌత్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.సుధాకర్‌ గౌడ్‌, వర్సిటీ అనుబంధ కళాశాల గౌతమి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ కే.సంజీవరావు, ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దండు స్వామి, ఇందూరు పీజీ కాలేజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ మదన్‌మోహన్‌ దేవబక్తునితోపాటు పలు సామాజిక విభాగాల నుంచి చెరు కూ రి రజినీకాంత్‌ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్‌ ఘాజీ, ఎస్‌.జయంత్‌ను ప్రభుత్వం నియమించింది. పాలకమండలి క్లాస్‌–1 సభ్యులుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఆ ర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కళాశాల వి ద్యా శా ఖ కమిషనర్‌ శ్రీదేవసేనతో పాటు పా లకమండలి చైర్మన్‌గా వైస్‌ చా న్స్‌లర్‌ ప్రొఫె సర్‌ టి.యాదగిరిరావు, కార్యదర్శిగా రిజిస్ట్రా ర్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి వ్యవహరిస్తారు. గత పాలకమండలి గడువు ఫిబ్రవరి 2024 ముగియగా, రెండేళ్ల రెండు నెలల సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వం పాలకమండలి నియమించడంతో వర్సిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నూతన పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారికి పలురువు శుభాకాంక్షలు తెలిపారు.

రజినీకాంత్‌

కాకతీయ సంస్థలు

Advertisement
 
Advertisement
Advertisement