రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో నిత్యం ఏదో ఒకచోట వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ రహదారులపై ధాన్యం ఆరబోయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హెచ్చరిక బోర్డులనూ ఏర్పాటు చేస్తున్నారు. అయినా కూడా కొందరు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. సిరికొండ మండల పరిధిలోని భీమ్‌గల్ – కామారెడ్డి ప్రధాన రహదారిపై పోలీసులు ఒకవైపు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా అవేమీ పట్టనట్లు కొందరు రైతులు రోడ్డుపైనే ధాన్యం ఆరబోశారు. అయితే గిడ్డంగులు, ఎండబెట్టే ప్రదేశాలు లేకపోవడంతోనే రోడ్లపైన ధాన్యం ఆరబోస్తున్నామని రైతులు చెప్తున్నారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


