స్కానింగ్‌ సెంటర్లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్లకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

సుభాష్‌నగర్‌: జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ చేయించుకోవాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం జిల్లాస్థాయి మ ల్టీమెంబర్‌ అప్రొప్రయేట్‌ అథారిటీ సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మా ట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదన్నారు. స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా రెన్యూవల్‌ చేసుకోవాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తన దృష్టికి వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా ఒక స్కానింగ్‌ సెంటర్‌, మూడు రెన్యూవల్‌, రెండు స్కానింగ్‌ సెంటర్ల మూసివేతకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో అథారిటీ సభ్యులు డాక్టర్‌ సుప్రియ, డాక్టర్‌ శిఖర, డాక్టర్‌ శ్వేత, స్పెషల్‌ బ్రాంచ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement