పార్లమెంటులో ప్రసంగించిన తెయూ విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో ప్రసంగించిన తెయూ విద్యార్థిని

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయ ఎంఏ ఇంగ్లిష్‌ విద్యార్థిని, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్‌ కీర్తన జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ‘నో యువర్‌ లీడర్‌’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆధ్వ ర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో ఎంపికై న 36 మంది ప్రతిభావంతులలో కీర్తన ఒకరిగా నిలిచారు. ‘డాక్టర్‌ అంబేడ్కర్‌ విజన్‌ ఫర్‌ ఇండియాస్‌ డెమోక్రసీ‘ అనే అంశంపై ఆమె ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా కీర్తన లోక్‌సభ స్పీకర్‌ను కలవడంతోపాటు పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. జాతీయ వేదికపై తెలంగాణ యూనివర్సిటీ కీర్తిని చాటిన కీర్తనను వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్‌ యాదగిరి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement