రుణం బంగారమాయె | - | Sakshi
Sakshi News home page

రుణం బంగారమాయె

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది

ఆర్మూర్‌: సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటివరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్‌ లోన్‌ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్బీఐ తాజా నిబంధనల కారణంగా సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నూతన నిబంధనలు ఇలా..

బంగారం రుణాలను అగ్రి లోన్స్‌, నాన్‌ అగ్రి లోన్స్‌ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకొనే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉన్నాయి. కానీ అంతకు మించి వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలి ఉంటే పట్టాదారు పాసు పుస్తకంతో పాటు తహసీల్దార్‌ ధృవీకరించిన ఆదాయ ధృవీకరణ పత్రం, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రసీదులు సమర్పించాల్సి ఉంటుంది.

ఇక నాన్‌ అగ్రి రుణం తీసుకొనే వారికి ఐటీఆ ర్‌, సిబిల్‌, ఆదాయ ధృవీకరణ చేసుకున్నాకనే రు ణం మంజూరు చేస్తారు. గతంలో డిఫాల్టర్‌గా ఉండి సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి బంగారంపై రు ణాలు ఇవ్వబడవు. ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూ డు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. రెన్యూవల్‌లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణంను రెన్యూవల్‌ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటును కల్పించింది. ఈ వెసు లుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. అలాగే బంగారం రుణాల మంజూ రు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపైనా కన్నేసి ఉంచా లని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు, రుణగ్రహీతల బ్యాక్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హ క్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించిన ట్లు సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్‌ పెట్టడంతోపాటు ఆర్థిక వ్య వస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్మూర్‌కు చెందిన వ్యాపారి వెంకటేష్‌ (పేరు మార్చాము) వ్యక్తిగత అవసరాల కోసం ఇంట్లో ఉన్న బంగారు నగలను తాకట్టు పెట్టి అతి తక్కువ వడ్డీతో రుణం తీసుకోవడానికి స్థానిక జాతీయ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు సిబ్బంది అతడికి ఆర్బీఐ సవరించిన నిబంధనలను వివరించడంతో సదరు వ్యక్తి అయోమయానికి గురికావాల్సి వచ్చింది. గతంలో ఆ బ్యాంకులో అకౌంట్‌ ఉంటే చాలు బంగారం తీసుకొని వెళితే నిమిషాల వ్యవధిలో రుణం మంజూరు చేసే వారు. కానీ తాజా నిబంధనల ప్రకారం తన సొంత బంగారాన్ని తాకట్టు పెట్టడానికి కూడా అతడి ఆదాయాన్ని ధృవీకరించే ఇన్‌కం టాక్స్‌ రిటన్స్‌ (ఐటీఆర్‌) సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిబిల్‌ను పరిశీలించి రుణం తీసుకోవడానికి అర్హత ఉంటేనే రుణం ఇస్తామంటూ వివరించారు. సదరు వ్యక్తికి అప్పటికే ఇంటిపై, కారుపై రుణాలు ఉండటంతో బంగారం తనఖాతో రుణం తీసుకోవడానికి అనర్హుడిగా పేర్కొన్నారు. దీంతో అతడు నిరాశతో వెనుదిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఆర్బీఐ బంగారం తనఖా రుణాలపై తెచ్చిన నిబంధనలు రుణ గ్రహీతలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నది తెలుస్తోంది. తాజా నిబంధనలతో బంగారం రుణాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనలను అమలు చేస్తూ ఏడాది పూర్తిచేసుకోనున్న బంగారు రుణాలను వడ్డీ మాత్రమే తీసుకొని రెన్యూవల్‌ చేస్తున్నాం.

– సుంకం వీర గణేష్‌ చారి, గోల్డ్‌ అప్రైజర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్మూర్‌

గోల్డ్‌లోన్‌ నిబంధనలు

కఠినతరం చేసిన ఆర్బీఐ

ఆదాయం లేని వారు రుణం

పొందడానికి అనర్హులు

రెన్యూవల్‌కు మాత్రం మినహాయింపు

Advertisement
 
Advertisement
Advertisement