నిజామాబాద్ లీగల్: జిల్లా న్యాయవాదుల పరస్పర కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం న్యాయవాదులు నామినేషన్ పత్రాలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు డాక్టర్ పులి జైపాల్, జగన్‌మోహన్ గౌడ్ తెలిపారు.
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామశివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన విద్యార్థిని భావన జాతీ యస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ నళిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల మహబూబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ అండర్–14 స్కూల్ గేమ్స్ పోటీలలో ప్రతిభను కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగబోయే జాతీయస్థాయి అండర్ –14 సాఫ్ట్‌బాల్ పోటీలలో భావన పాల్గొంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. భావనను ప్రిన్సిపాల్ నళినితోపాటు జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వనిత, పీటీ నర్మద, సాఫ్ట్‌బాల్ అకాడమీ కోచ్ వేముల మౌనిక, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.
ఖలీల్‌వాడి: పదో తరగతి వార్షిక పరీక్షలకు 32 మంది గైర్హాజరైనట్లు డీఈవో పార్శి అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం జరిగిన వొకేషనల్ పరీక్షకు 2,207 మంది విద్యార్థులకు 2175 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 21 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు.
ముగ్గురు డిబార్
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశా ల (స్వయం ప్రతిపత్తి) బుధవారం 6వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు కొనసాగుతున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామోహ్మన్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో 1071 విద్యార్థులకు 1052 మంది హాజరుకాగా, 19 మంది గైర్హాజరయ్యారు. ముగ్గురు విద్యార్థులు డిబారయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్‌రాజ్ తెలిపారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సుల 8 సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తనిఖీ చేశారు. వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగినచర్యలు తీసుకోవాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట అడిషనల్ కంట్రోలర్ సంపత్ ఉన్నారు. ఈ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 45 మంది హాజరైనట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ తెలిపారు.


