మంత్రికి ప్రముఖుల స్వాగతం | - | Sakshi
Sakshi News home page

మంత్రికి ప్రముఖుల స్వాగతం

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

నిజామాబాద్‌ అర్బన్‌: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం నగరంలో నిర్వహించిన అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఆయనకు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ వద్ద కలెక్టర్‌, సీపీతోపాటు రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మేయర్‌ ఉమారాణి, అదనపు కలెక్టర్‌ దిలీప్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్లు వికాస్‌ మహతో, అభిగ్యాన్‌ మాల్వియా, డీసీసీ అధ్యక్షుడు నగేష్‌ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్‌ కేశ వేణు, ఇతర జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కంఠేశ్వర్‌ బైపాస్‌ వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement