నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదాలు

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చే సుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పో తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ శివారులోని సుగుణ గార్డెన్స్‌లో పోలీస్‌, రవాణా శాఖలు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమానికి మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆలోచనా విధానంలో మా ర్పు రావాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క రూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయన్నారు. ఎవరికివారు తమవంతు బాధ్యతగా ట్రాఫిక్‌ రూల్స్‌ ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు.

జిల్లాకు త్వరలోనే కొత్త బస్‌ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు.

రూరల్‌, అర్బన్‌ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్‌పాల్‌, మేయర్‌ ఉమారాణి, రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు ప్రసంగించారు. నిజామాబాద్‌ బస్టాండ్‌ను ప్రయాణీకుల తాకిడికి అనుగుణంగా నిర్మించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ వినతిపత్రం అందజేశారు. అనంతరం వాల్‌ పోస్టర్లను, కర పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ తారిక్‌ అన్సారీ, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, అదనపు కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్లు వికాస్‌ మహతో, అభిగ్యాన్‌ మాల్వియా, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజిరెడ్డి, నుడా చైర్మన్‌ కేశ వేణు, డాక్టర్‌ కవితారెడ్డి, డీటీసీ దుర్గా ప్రమీల, విద్యార్థు లు, మహిళలు, యువకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆలోచనా విధానంలో

మార్పు రావాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు

స్వీయ నియంత్రణ తప్పనిసరి

నిజామాబాద్‌ జిల్లాకు కొత్త బస్‌డిపో

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement