మహిళలకు చట్టసభల్లో కోటా కోసం బిల్లు అమోదం పొందడం హర్షణీయం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంశం ఇది. ఇంటిని చక్కదిద్దే మహిళలు మైక్రో (సూక్ష్మ) మేనేజ్‌మెంట్ నుంచి మాక్రో (స్థూల) మేనేజ్‌మెంట్ వరకు సమాజాన్ని దిశానిర్దేశం చేయడంలో స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో చట్టసభల్లోనూ సముచిత స్థానం దక్కడం గర్వకారణం. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విషయంలో వ్యవస్థలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ మహిళలకు తిరుగులేని స్థానం ఉంది. – నల్ల స్రవంతిరెడ్డి, వ్యాపారి


