న్యూస్‌రీల్
మహిళల పాత్రతో దేశానికి మేలు
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
చట్టాలను రూపొందించే పార్లమెంటు, శాసన సభల్లోకి మహిళలు గణనీయమైన స్థాయిలో వెళ్లే అవకాశం రావడం చరిత్రాత్మకం. చట్టాల రూపకల్పనలో మహిళలకు కీలక పాత్ర కల్పించడంతో దేశానికి చాలా మేలు కలుగుతుంది. ఇప్పటికే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలుగా, టెక్నోక్రాట్లుగా, మరోవైపు న్యాయ మూర్తులుగా చరిత్రాత్మక తీర్పులు ఇస్తున్న నేప థ్యం ఉంది. న్యాయవాదులుగా కీలకమైన కేసు లు వాదిస్తూ విజయం సాధిస్తున్నారు. కార్య నిర్వాహక విభాగాల్లో, క్రీడారంగంలో, వ్యాపార రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. చట్టసభ ల్లోనూ తిరుగులేని పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. – కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి,
హైకోర్టు న్యాయవాది


