తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయని పే ర్కొన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్ www.telanga nauniversity.ac.inను సంప్రదించాలని సూచించారు.
ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
ఖలీల్‌వాడి: ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని డీఐఈవో తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద ఉన్న ఇంటర్మీడియెట్ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో సమీక్ష నిర్వహించారు. అధ్యాపకుల తో వెంటనే సమావేశాలు నిర్వహించి ఫెయి ల్ అయిన విద్యార్థుల కోసం సబ్జెక్ట్‌ల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఐఈవో ఆదేశించారు. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు, అధ్యాపకులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడాలని, తక్కువ ఫలితాలు సాధించిన కళాశాలల ప్రిన్సిపాల్ లు తగిన శ్రద్ధ వహించాలని అన్నారు. కళాశాలలు పునఃప్రారంభించేలోగా అన్ని సివిల్ పనులు పూర్తి చేయించాలని, పనులకు కావాల్సిన నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను డీఐఈవో ఆఫీస్‌లో అందజేయాలని ప్రిన్సిపాల్‌లకు సూచించారు.
బహిరంగ వేలంతో
రైతులకు నష్టం
సుభాష్‌నగర్: పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, నిజామాబాద్ మార్కెట్‌యార్డ్‌లో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టడంతో మద్దతు ధర పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గంజ్‌లో ధర్నా చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్‌కు భారీగా పసుపు వచ్చినప్పటికీ, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉండి కూడా లాభం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇటీవల ఎంపీ అర్వింద్ ‘ఈ–నామ్ 1.50’ కింద కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదన్నారు. దళారులు కుమ్మౖకై ్క బహిరంగ వేలం ద్వారా తక్కువ ధరకు పసుపు కొను గోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని సహించబోమని, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రశాంత్‌రెడ్డి హెచ్చ రించారు. ఈ–నామ్ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
30 డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లు స్వాధీనం
సుభాష్‌నగర్: నగరంలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో వినియోగిస్తున్న గృహ వినియోగ 30 ఎల్‌పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాణిజ్య ప్రయోజనాల కోసం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్లను వాడొద్దని, కమర్షియల్ సిలిండర్లను వాడాలని ఆదేశించారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడిలో టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ శేఖర్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు (సివిల్ సప్లయ్) పవన్‌కుమార్, ఎం శ్రీనివాస్, నిఖిల్ రాజ్, వినోద్, మహేష్‌కుమార్ పాల్గొన్నారు.


