బహిరంగ వేలం వద్దు | - | Sakshi
Sakshi News home page

బహిరంగ వేలం వద్దు

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లు బహిరంగ వేలం విధానంలో చేపట్టవద్దని రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. వ్యాపారులు కుమ్మకై ్క పసుపు ధరకు తగ్గిస్త్తున్నారని, ఆన్‌లైన్‌ విధానంలోనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులంతా ఒక్కసారిగా మార్కెట్‌ కమిటీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అ డ్డుకోగా, కార్యాలయ గేట్‌ వద్దే బైఠాయించి నినా దాలు చేశారు. దీంతో మార్కెట్‌ కమిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ధర పడిపోయిందని..

శుక్రవారంతో పోలిస్తే బుధవారం నాడు క్వింటాల్‌ కు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆరోపించారు. పసుపు కు ప్పల వద్దకు ఎక్కువ సంఖ్యలో రాకుండా కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్యాలయ గేట్‌ వద్ద బైఠాయింపు..

కార్యాలయం లోనికి చొచ్చుకెళ్లిన రైతులను పోలీ సులు బయటికి పంపించారు. ఒకదశలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వావాదం, తోపులాట చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. కోపోద్రిక్తులైన రైతులు గేట్‌ వద్దే బైఠాయించి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్‌ అధికారులు ఈ– నామ్‌ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు అందుబాటులోకి రాలేదు. విషయాన్ని కలెక్టర్‌, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీ..

రైతులు మార్కెట్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ర్యాలీగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఆన్‌లైన్‌ (ఈ–నామ్‌) విధానంలోనే పసుపు కొనుగోళ్లు చేప డతామని అదనపు కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

నేటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే..

మార్కెట్‌ యార్డులో గురువారం నుంచి పసుపు, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఆన్‌లైన్‌ ద్వారానే చేపట్టాలని నిర్ణయించినట్లు సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ అపర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–నామ్‌ 2.0లో సాంకేతిక సమస్యల వల్ల ఏప్రిల్‌ 3 నుంచి ఆన్‌లైన్‌ వేలంలో కాకుండా బహిరంగ వేలం ద్వారా క్రయవిక్రయాలు చేపట్టామన్నారు. కలెక్టర్‌, మార్కెటింగ్‌శా ఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లోనే క్రయవిక్రయాలు చేపట్టాలని నిర్ణయించామని పే ర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌యార్డులో ఉన్న సరు కు పూర్తిగా అమ్మిన తర్వాతే కొత్త సరుకును అనుమతిస్తామని, రైతులు గమనించాలని కోరారు.

పసుపు కొనుగోళ్లు ఆన్‌లైన్‌లోనే చేపట్టాలి

వ్యాపారులు కుమ్మకై ్క ధర తగ్గిస్తున్నారని రైతుల ఆందోళన

మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో

ఫర్నిచర్‌ ధ్వంసం

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

హామీతో నిరసన విరమించిన రైతులు

Advertisement
 
Advertisement
Advertisement