కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంపీడీవో లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీవోలతో భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమీ క్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి మరమ్మతులు తదితర వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించా రు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేప ట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టే ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూ చించారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, మిషన్ భగీరథ ఈఈ రాకేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి..
గోన్ గొప్పుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి అనువుగా ఉందన్నారు. ఆమె వెంట డీఈవో అశోక్, ఎంఈవో స్వామి, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్ మహ్మద్ షబ్బీర్ తదితరులు ఉన్నారు.
అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలి
అధికారులకు కలెక్టర్
ఇలా త్రిపాఠి ఆదేశం
భీమ్‌గల్ మండల పరిషత్
కార్యాలయంలో అధికారులతో సమీక్ష


