మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించలేం | - | Sakshi
Sakshi News home page

మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించలేం

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

నిజామాబాద్‌ అర్బన్‌: ‘ప్రజాపాలన – ప్రగతి ప్ర ణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా పో లీస్‌, రవాణా శాఖలు సంయుక్తంగా జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. హెలీకాప్టర్‌ ద్వా రా మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి ముందుగా నగరంలో ని ర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కోసం చేపట్టిన బైక్‌ ర్యాలీ ని మంత్రి పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద జెండా ఊ పి ప్రారంభించారు. రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బైపాస్‌ చౌరస్తా వరకు డ్రైవ్‌ చేశారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతోపాటు నగ ర మేయర్‌ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ తదితరులు మానవహారంలో భాగస్వాములు అయ్యారు. ట్రాఫిక్‌ నిబంధనలు విధిగా పాటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అన్ని వర్గాల వారు ‘అరైవ్‌ – అలైవ్‌’లో పాల్గొని ప్రమాదాల నివారణకు తమవంతు దోహదపడాలని పిలుపునిచ్చారు.

‘‘ఎన్ని చట్టాలు, నిబంధనలు అమలు చేసినా ప్రజల్లో మార్పు రానంత వరకు ప్రమాదాలను నివారించడం సాధ్యం కాదు. అతివేగం, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.’’ – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement