● సీపీని కలిసిన ఇండియన్ ఓవర్సీస్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుధాకర్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్‌ఆర్‌ఐలు, వారి కుటుంబాల రక్షణ, భద్రత కోసం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ (లండన్) ఉపాధ్యక్షుడు ఆర్ సుధాకర్‌గౌడ్ సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, గల్ఫ్, అరబ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాల భద్రత, రక్షణ విషయమై చర్చ జరిగింది. ఎన్‌ఆర్‌ఐల తరఫున సుధాకర్‌గౌడ్ సీపీకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ దేశాల్లో పనిచేసే ఎన్‌ఆర్‌ఐల ఆస్తుల విషయంలో కొందరు వడ్డీ వ్యాపారులు అక్రమంగా దక్కించుకునేందుకు ప్రయత్నా లు చేస్తున్నారన్నారు. ఎన్‌ఆర్‌ఐలు, వారి కుటుంబ సభ్యుల మీద వక్రమార్గాల్లో కేసులు పెట్టిస్తామని సదరు వడ్డీ వ్యాపారులు భయపెట్టిస్తున్నారన్నారు. తిరిగి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేకుండా కేసులు పెట్టిస్తామని కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో మరణించిన వారికి సంబంధించి ఆయా కుటుంబ సభ్యులను భార్యలను, పిల్లలను, ఒంటరి మహిళలను భయభ్రాంతులకు గురిచేసేవాళ్ల ఆగడాలు అరికట్టాలని కోరారు.
● స్పందించిన సీపీ.. ఎన్‌ఆర్‌ఐల కోసం సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు వారి తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల వివరాలు ఇస్తే ప్రతి నెలా పోలీసు శాఖ ద్వారా పరామర్శించి వారికి న్యాయపరమైన సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని సీపీ తెలిపారు.


