న్యూస్‌రీల్
హిందూ ధర్మాన్ని ఆచరించాలి
హిందువుల అన్ని సమస్యలకు పరిష్కారం సనాతన ధర్మాన్ని ఆచరించడమేనని విద్యాభారతి ప్రతినిధి లక్ష్మణరావు అన్నారు.
వాతావరణం
ఉదయంనుంచే ఎండ తీవ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. రాత్రి నిర్మలంగా ఉంటుంది.
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
నిజామాబాద్‌అర్బన్: భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోనే జిల్లాలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆలూర్ మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో జనాలు అల్లాడారు. జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో గత వారం రోజులుగా క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ముగియగా, పాఠశాల స్థాయిలో కొనసాగతున్నాయి. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండలతో హడలిపోయిన జనం...
జిల్లాలో ఎండ తీవ్రత పెరిగిపోవడంతో జనం హడలిపోతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకే ఎండ మండిపోవడంతో జనం రోడ్లపై తిరగడానికి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడతో షాపింగ్, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా జంకుతున్నారు. వడగాలులు కూడా వీస్తుండడంతో ఇబ్బందిపడుతున్నారు.
మచ్చర్ల
43.2


