ట్రాఫిక్‌ నిబంధనలను అలవాట్లుగా మార్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలను అలవాట్లుగా మార్చుకోవాలి

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా

నియమాలు పాటించాలి

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ శివధర్‌రెడ్డి

ఎన్‌హెచ్‌ 44పై వీఐడీఎస్‌ ప్రారంభం

ఇందల్వాయిలో ఎన్‌హెచ్‌ 44పై వీఐడీఎస్‌ని ప్రారంభిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి

కామారెడ్డిలో ప్రసంగిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి

ఇందల్వాయి: హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధారణ, నిర్ణీత వేగం, ట్రాఫిక్‌ నియమాలు పాటించడం నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని డీజీపీ బి శివధర్‌రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా చంద్రయాన్‌పల్లి గ్రామం వద్ద మంగళవారం నిర్వహించిన ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 44వ నంబరు జాతీయ రహదారిపై వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ (వీఐడీఎస్‌)ని ప్రారంభించారు. వీ ఐడీఎస్‌ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ఏఐ విశ్లేషణతో కూడి అధునాతన కెమెరాలతో పనిచేస్తుందని డీజీపీ వివరించారు. అనంతరం గ్రామస్తు లతో ‘అరైవ్‌ – అలైవ్‌’ కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయించారు. సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజారెడ్డి వెంకటరెడ్డి, వెంకట్‌రెడ్డి, డిచ్‌పల్లి సీఐ వినోద్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ట్రాఫిక్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి ఎస్సైలు ఆరిఫ్‌, సందీప్‌, ఈ–డార్‌ మేనేజర్‌ వర్ష, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ వీరబాలు, సర్పంచ్‌ రఘు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement