నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం (నేడు) జిల్లాకు రాను న్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి డీఎస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం సుగుణ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంత్రి మధ్యాహ్నం 2.45 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సుభాష్‌నగర్: నిజామాబాద్ నగరంలోని డీ–4 సెక్షన్ పరిధిలోగల పలు ప్రాంతాలకు బుధవారం ఉదయం 8.30 నుంచి మధ్యా హ్నం 12.30గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్–3 ఏడీఈ వినోద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11 కేవీ లైన్ కింద చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శ్రీనగర్ కాలనీ, ఏబీఎస్ వెంచర్, బాల హనుమాన్ టెంపుల్ ఏరియా, ఫ్రుడెన్స్ ఆస్పత్రి, శ్రీకృష్ణ ఆస్పత్రి, యెండల టవర్స్, ప్రశాంతి హో మ్స్, కేఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్స్, రుక్మిణి అపార్ట్‌మెంట్, స్వరూప అపార్ట్‌మెంట్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వినోద్ కోరారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థిని కలిగోట వీణ అండర్–18 జాతీయ హాకీ జట్టుకు ఎంపికయ్యింది. ఇటీవల రాంచీలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ చూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల పీఈటీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 19 నుంచి భోపాల్‌లో నిర్వహించే ఇండియన్ టీం క్యాంప్‌లో పాల్గొటుందని పేర్కొన్నారు. అనంతరం జపాన్‌లో నిర్వహించే సబ్ జూనియర్ అండర్ –18 ఆసియా కప్ హాకీ పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు.
మోడల్ స్కూళ్లకు
ప్రవేశ పరీక్ష
ఖలీల్‌వాడి: తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈనెల19న నిర్వహించనున్నట్లు డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉద యం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడో తరగ తి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని పేర్కొ న్నారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసు కున్న విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల ని సూచించారు. మరిన్ని వివరాలకు 93912 66444 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


