మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

అందరినీ భాగస్వాములను చేయాలి

టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం

నిజామాబాద్‌ అర్బన్‌: ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16న మండల కేంద్రాలు, మున్సిపల్‌ పట్టణాల్లో నిర్వహించనున్న సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్‌ టెలీకాన్ఫరెనన్స్‌ ద్వారా అధికారులతో మంగళవా రం మాట్లాడారు. ముందస్తుగానే సభా వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించా రు. ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతోపాటు ఇతర మండల స్థాయి అధికారులతో సమావేశమై తగిన సూచనలు చేయాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 8 నుంచి 10.30 గంటలలోపు సభలు ముగిసేలా చర్యలు తీసుకోవాలని, సభా ప్రాంగణాల వద్ద నీడ, తాగునీటి వసతులు కల్పించాలన్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి వాటికి సంబంధించి గ్రామ సభల్లో వచ్చిన అర్జీలను మండల సభలకు ముందు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించడంతోపాటు అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమం గురించి సభల్లో తెలియజెప్పాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్‌, దిలీప్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్లు వికాస్‌ మ హతో, అభిగ్యాన్‌ మాల్వియా, జెడ్పీ సీఈవో సా యాగౌడ్‌, డీఆర్డీవోలు సాయన్న, రాజేంద్రకుమార్‌, డీపీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement