● రైతులతో ప్రయివేట్ కంపెనీ ఒప్పందం
● వేయి ఎకరాల్లో సాగు చేసిన రైతులు
మోర్తాడ్(బాల్కొండ): మొక్కజొన్న రైతుల ఇంట సి రులు కురిపిస్తోంది. విత్తనోత్పత్తి కోసం రైతుల తో ప్రయివేట్ సీడ్ కంపెనీ ఒప్పందం చేసుకుని సాగు చేయించింది. ఎర్రజొన్న సీడ్ వ్యాపారులు సిండికేట్ గా మారి ధర దక్కకుండా చేయడంతో రైతులు యాసంగిలో సీడ్ మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. ఓ కంపెనీ వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయించగా, ఎకరానికి 45 నుంచి 55 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటాల్‌కు రూ.2,200 ధర నిర్ణయించారు. కంకుల నుంచి మక్కలను వేరు చే యకుండా అలాగే తూకం వేయించి కంపెనీకి తరలించారు. ఎకరానికి రైతులకు రూ.లక్ష నుంచి రూ.1.20లక్షల ఆదాయం సమకూరింది. విత్తనోత్ప త్తితోపాటు పాప్‌కార్న్ తయారీ కంపెనీలకు మొక్కజొన్నను సరఫరా చేసినట్లు రైతులు వెల్లడించారు.


